నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు పరిశుద్ధుడె రావాలి ....
ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలి పీఠము నెక్కావు
నీ ప్రాణమే బలిగా అర్పించి
మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు|| నీ రక్తమే పాప పరిహారం ||
సూరూపమేమి లేక కురూపివైనావయ్యా - నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా .....
ప్రభువా నిశ్చయముగ మా రోగాలు - భరియించావు నీ దేహములో
మా వ్యసనములన్నిటి సహియించి
మా శాపగ్రాహి వైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు || నీ రక్తమే పాప పరిహారం ||
నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగి వచ్చావె
మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే.....
ప్రభువా నీ తగ్గింపుకు సమమేది - నీ అద్భుత కృపకు మితి ఏది
నీ ప్రేమకు ఇలలో సాటేది
నీవంటి రక్షకుడు ఏడి -నీలాంటి ప్రేమ ఘనుడేడి || నీ రక్తమే పాప పరిహారం ||
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
