Song no: 461
- ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||
- ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||
- క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||
- పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||
- నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||
- జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||
- నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు విభుని సేవకు నీ వర్పించు ||నాత్మలను||
కామెంట్‌ను పోస్ట్ చేయండి