హోమ్సి సిలువలో నీ ప్రేమ పాపము తీసేనయ్యా సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2) ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో|| తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2) నను విడిపించుటకు – విలువను విడిచితివి పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని|| దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2) నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి మరణము దాటుటకు – బలిగా మారితివి (2) ||ఘోర పాపిని|| అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2) నిను చాటించుటకు – వెలుగై సాగెదను ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2) ||ఘోర పాపిని|| Siluvalo Nee Prema – Paapamu Theesenayyaa Maranamu Cheralo Nundi – Nanu Vidipinchenayyaa (2) Ghora Paapini Nenu – Parishuddhuni Chesithivi Nithya Jeevamulo Nannu – Niluputaku Bali Aithivi (2) ||Siluvalo|| Thaalaleni Nee Thaapam – Tholaginchenu Naadhu Shaapam Naliginatti Nee Roopam – Ichchenu Naaku Swaroopam (2) Nanu Vidipinchutaku – Viluvanu Vidichithivi Paramunu Cherchutaku – Mahimanu Marichithivi (2) ||Ghora Paapini|| Daiva Thanayuni Deham – Mosindi Cheyani Neram Kadigendhuku Naa Dosham – Chindinche Niluvunaa Rudhiram (2) Nanu Kaapaadutaku – Rottegaa Virigithivi Maranamu Dhaatutaku – Baligaa Maarithivi (2) ||Ghora Paapini|| Adhamudainatti Nenu – Nee Prema Arhudanu Kaanu Pogidi Ninnu Prathi Kshanamu – Theerchalenu Nee Runamu (2) Ninu Chaatinchutaku – Velugai Saagedhanu Premanu Panchutakai – Uppuga Nilichedhanu (2) ||Ghora Paapini||
కామెంట్‌ను పోస్ట్ చేయండి