క్రైస్తవుండా కదిలిరావయ్యా

647

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ సిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ||

  1. వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొని వాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేత మిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా నీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ||

  2. సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము చాట రావయ్యా ||క్రైస్తవ||

  3. శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనస్సు బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||

  4. నీతికై భక్తాదిపరులెల్ల నిజవిశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||

  5. ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి

Post a Comment

కొత్తది పాతది