Sarva yugamulalo sajeevudavu సర్వ యుగములలొ సజీవుడవు

Song no: 160
    సర్వ యుగములలొ సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాడదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా

  1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే } 2
    శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా } 2 || సర్వ ||

  2. స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
    శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే } 2
    నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణమును గెలిచిన బహుధీరుడా } 2 || సర్వ ||

  3. కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
    బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను } 2
    నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
    శతృవునణచిన బహుశూరుడా } 2 || సర్వ ||

Post a Comment

కొత్తది పాతది