యేసు నా ప్రియ కాపరి రక్షణకు నిజమైన దారి నడిచెదను ఆయన వెంటే

యేసు నా ప్రియ కాపరి
రక్షణకు నిజమైన దారి
నడిచెదను ఆయన వెంటే- నిలిపి
ఆయనపై నా గురి

చరణం:1
తండ్రి తనయుని ఎరిగినట్లుగా
మంచి కాపరి నన్ను ఎరుగును
పేరు పెట్టి నన్ను పిలుచును
నాకు ముందు తాను నడచును

చరణం:2
తండ్రి చేతిలో నేను ఉండగా
నన్నెవరు అపహరింపలేరుగా
నిదురపోక నన్ను కాయును
దినములన్ని క్షేమమీయును

చరణం:3
గోర్రే నైన నాకు జీవమీయగా
తన ప్రాణమునే బలిగా చేసెను
శాంతి జలము చెంత చేర్చును
కృపను చూపి సేద తీర్చును || హల్లెలూయ ||
eng || Hallelooya ||
Blogger ఆధారితం.