మార్గమైయున్న నీ ద్వార తప్ప తండ్రి యొద్దకు ఎవరూ చేరనేలేరయ్యా "2" || నీవుండు ||
1.తండ్రి నీలో ఉండి తన క్రియలు చేయుచుండెను నిను నమ్మి నేను కూడా గొప్ప పనులు చేయగలను "2" || మార్గమైయున్న ||
2.తండ్రి ఇంటిలో ఎన్నో నివాసములు కలవు నా కొరకు స్థలమును నీవు సిద్ధపరచుచున్నావు "2" || మార్గమైయున్న ||
3.దాసుడని నన్ను పిలువుక స్నేహితుడనన్నావు నీ పక్కనే కూర్చుండే ధన్యతనుగ్రహించావు "2" || మార్గమైయున్న ||
4.నీ నామమున ఏది అడిగినా చేస్తావు సత్యమగు ఆత్మద్వారా నన్ను ఆదరిస్తావు "2" || మార్గమైయున్న ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి