Song no: 250
- ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
- హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా
ప్రేమ చూపువారు లేరు లోకమందునా
నేను కోరుకోకుండా నాకోసము
తనకు తాను చేసినాడు సిలువయాగము
- అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా
నీచుడనని చూడకుండా నాకోసము
మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము
- స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
మేలు చేయువారు ఎవరు విశ్వమందునా
ఏమి దాచుకోకుండా నాకోసము
ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము
ఈలాటి స్నేహితుడు
నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు