హోమ్(స సిలువే నా శరణాయెను రా 198 సిలువ బలము రాగం - కురంజి (చాయ : )తాళం - ఆది సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే || సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే || సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే || సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా ||నీ సిలువే || పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాఁడను రా ||నీ సిలువే || శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే || ✍ చెట్టి భానుమూర్తి Siluvae naa saranaayenu raa – nii – siluvae naa ssaranaayenu raa = siluva yandhae mukthi balamu - chuuchithi raa || Nee Siluve|| siluvanu vraali yaesu – palikina palukulandhu = viluva laeni praemaamruthamu groalithiraaa || Nee Siluve|| siluvanu chuuchu koladhi – sila samaanamaina manasu = naligi karigi nii ragu chunnadhi raaa || Nee Siluve|| siluvanu tharachi tharachithi – viluva kandhaga raani nii krupa = kalusha mellanu baapaga chaalunu raa || Nee Siluve|| palu vidha palamu larasi – phalitha maemi gaana laeka = siluva yedhutanu nilachi naadanuraa || Nee Siluve|| saranu yaesu saranu saranu – saranu saranu naa prabhuvaa = dhuritha dhuuruda nii dhari jaerithi raa || Nee Siluve|| ✍ Chetty Bhanumurthi