సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ

సాకి:సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ
పల్లవి:సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ (2)
సాటిలేనిది అనంతమైనది (2) || సాటిలేని ||

1. నీ కన్నులు నన్ను చూస్తుండగా నా పాపము పెరిగిపోవుచుండగా (2)
నీ ప్రేమ నను విడిచి పోలేదయా పాపములో నను విడిచి పెట్టలేదయా (2)
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయ
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్నుక్షమించినాదయ్యా (2) || సాటిలేని ||

2. నా కన్నులు కప్పిపోయి ఉండగా నిన్ను నేను తృణీకరించుచుండగా (2)
నీ ప్రేమ నను విడిచి పోలేదయా పాపములో నను విడిచి పెట్టలేదయా (2)
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను క్షమించినాదయ్యా (2) || సాటిలేని ||

3. నా హృదయము మోసగిస్తుండగా నా శరీరము లోకాన్ని ప్రేమిస్తుండగా (2)
నీ ప్రేమ నన్ను సహిస్తుండెనా నా పాపము నిన్ను గాయ పరుస్తుండెనా (2)
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయ (2) || సాటిలేని ||

సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ (2)
నీ ప్రేమను వివరింపలేనయా నా జీవితమును వెలిగింపజేయయా (2)
సాటిలేనిది నీ ప్రేమయా || సాటిలేని ||
eng || Hallelooya ||
Blogger ఆధారితం.