మరువని ప్రేమ విడువని ప్రేమ మారని యేసయ్య ప్రేమ
మారని యేసయ్య ప్రేమ
మరువని కల్వరి ప్రేమ
ప్రేమ యేసు ప్రేమ
ప్రేమ సత్య ప్రేమ
ప్రేమ దివ్య ప్రేమ
ప్రేమ నిజమైన ప్రేమ
ఆస్తులు పోయిననేమి ఆపదలు ఎంనైననేమి
దేహము కుళ్ళిననేమి దురవస్థలేమైనానేమి "2"
విడువక తన కృప నిత్యము చూపించు నా యేసు ప్రేమ తోడుండగా
భయమెందుకు దిగులెందుకు లోకము నాకెందుకు "2" || ప్రేమ ||
సముద్రము పొంగిననేమి శత్రువులు వెంటాడిననేమి
శోధనలెన్నైనానేమి సమాధానం కొదువైననేమి "2"
శాంతి సంధాన సమృద్ధినొసగిన నాయేసు ప్రేమ తోడుండగా "2"
భయమెందుకు దిగులెందుకు సాగేది నే ముందుకు "2" || ప్రేమ ||