తరియించెను విశ్వం తనలో
దేవ దేవుడు పుట్టాడని-నిత్య సంతోషం తెచ్చాడని
అ.ప: ఆనంద గానాల వేళ
సంతోష సువార్త హేలా ఇది || పులకించెను ||
1)పరలోక సైన్య సమూహం- పాడింది ఒక కొత్త గీతం
సర్వోన్నత స్థలములలో-దేవునికి మహిమ ప్రభావం
భూమి మీద తనకిష్టులైన మనుష్యులకు సమాధానము-సమాధానము || పులకించెను ||
2)ప్రజలందరికి కలుగబోవు- మహా గొప్ప శుభ వర్తమానము
రక్షకుడు మీ కొరకు నేడు జన్మించినాడు చూడు
పొత్తి గుడ్డలతో చుట్టబడిన లోక రక్షకుని ఆనవాలు-ఆనవాలు || పులకించెను ||
3)బహు ఆశ్చర్య పడుచు- గొల్లలు పాడారు స్తుతి స్తోత్ర గీతం
యేసును దర్శించగానే జ్ఞానులు ఇచ్చారు బహుమానం
కన్న వాటిని విన్న వాటిని ప్రజలందరికి ప్రచురపరచిరి-ప్రచురపరచిరి || పులకించెను ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి