కన్నులెత్తి చూడగా ఆకాశమందు నీవు తప్ప ఎవ్వరున్నారయ్యా no audio

కన్నులెత్తి చూడగా ఆకాశమందు
నీవు తప్ప ఎవ్వరున్నారయ్యా
నా కన్నీరు తుడవగా భూలోకమందు
నీవు గాక ఎవ్వరూ లేరయ్యా (2)
నీవేనయ్యా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా
నీవేనయ్యా నీవేనయ్యా
నా ఆశ్రయదుర్గం నీవేనయ్యా (2)

1️⃣. ముందు నే నిలుచున్నా వెనుక నీవున్నావని
ధైర్యంగా వెళుతున్నా సాయంగా వస్తావని (2)
నువ్వు లేకుండగా ఏ చిన్న కార్యం
నే చేయలేనయ్యా (2) || నీవేనయ్యా ||

2️⃣. శత్రువులు పైబడినా నీవుండ భయపడను
శ్రమకాల మందైనా చింతిస్తూ నిలబడను (2)
నీ తోడు ఉండగా ఏ కీడు చూసి
నే కృంగిపోనయ్యా (2)
|| నీవేనయ్యా ||
eng || Hallelooya ||

Post a Comment

కొత్తది పాతది