Song no: 97
- దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా
- పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే -2
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే -2 || దేవా! నీ కృప ||
- రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే -2
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే -2 || దేవా! నీ కృప ||
- విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే -2
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే -2 || దేవా! నీ కృప ||
- కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా -2
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2 || దేవా! నీ కృప ||
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా .....
దేవా! నీ కృప నిరంతరం
కామెంట్‌ను పోస్ట్ చేయండి