లాలి లాలి లాలి లాలమ్మ లాలీ లాలియని

122
క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి తాళం - ఆట

Laali Laali Laali Laalamma laali } 2
Laali yani paadare baala Yesunaku

  • Paraloka Devuni tanayudo yamma } 2
    Pudamipai Blaaluduga butteno yamma || Laali Laali ||

  • Iha paraadula kartha eetadoyamma } 2
    Mahipaalanamu jeya mahitudo yamaa || Laali Laali ||

  • Aadyantamulu leni Devudoyamma } 2
    Aadaamu doshamuna kaddu pade namma || Laali Laali ||

  • Yudula raajuga buttenoyamma } 2
    Yudulaatanitoda vaadinchi ramma || Laali Laali ||

  • Naragorrela manda kaaparoyamma } 2
    Goriyala praanambu Kreesthu taanamma || Laali Laali ||
  • లాలి లాలి లాలి లాలమ్మ లాలీ } 2
    లాలియని పాడరే బాలయేసునకు

  • పరలోక దేవుని తనయుడో యమ్మా } 2
    పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా || లాలి లాలి ||

  • ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ } 2
    మహి పాలనము జేయు మహితుడో యమ్మా || లాలి లాలి ||

  • ఆద్యంతములు లేని దేవుడో యమ్మా } 2
    ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా || లాలి లాలి ||

  • యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా } 2
    యూదు లాతని తోడ వాదించి రమ్మా || లాలి లాలి ||

  • నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా } 2
    గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా || లాలి లాలి ||


  • ads
    Blogger ఆధారితం.