క్రీస్తు నందు ఉన్నవారికి

    క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే
    జయం జయం హోసన్నా హల్లెలూయ హోసన్నా
    1. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను
    ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు చెందను ||క్రీస్తు|| 2. నా యేసు ముందు నడువగా నాకెప్పుడూ జయమే
    నా చెయ్యి పైకెత్తి హోసన్నా పాడెదను ||క్రీస్తు|| 3. సాతాను అధికారము నా యేసు పడగొట్టెను
    సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను ||క్రీస్తు|| 4. పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను
    యేసుని రక్తముచే స్వస్థత నొందితిని ||క్రీస్తు||

Post a Comment

కొత్తది పాతది