4
రాగం - కాంభోజి
తాళం - ఆది
|
|
రాగం - కేదారగౌళ |
|
తాళం - ఆది |
దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర ||దేవా||
సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి ||దేవా||
అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా||
సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె ||దేవా||
నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు ||దేవా||
ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె ||దేవా||
✍ పురుషోత్తము చౌధరి
కామెంట్‌ను పోస్ట్ చేయండి