Song no: #68
- ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||
- ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||
- జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||
- మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన||