646
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి ||క్రైస్తవ||
- చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||
- పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవ||
- శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను ||క్రైస్తవ||
- కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను ||క్రైస్తవ||
- చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి