"యేసుక్రీస్తు ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి, గొప్పకార్యాలు చేసే ఘనతనిచ్చాడు. "
క్రైస్తవ సంఘమా - ఘనకార్యాములు చేయు - కాలము వచ్చెను తెలుసునా - 2
క్రీస్తు ప్రభువు నీ - క్రియల మూలంబుగా - కీర్తి పొందునని తెలుసునా - 2
కీడు నోడింతువు తెలుసునా - కిటుకు విడగొట్టుదువు తెలుసునా
1. పరమ ధర్మంబులు - భాషలన్నిటి యందు - ప్రచురింతువని నీకు తెలుసునా - 2
నరుల రక్షకుడొక్క - నజరేతు యేసని - నచ్చచెప్పుదువని తెలుసునా - 2
నడిపింతువని నీకు తెలుసునా - నాధుని చూపింతువు తెలుసునా
2. యేసుని విషయాలు - ఎరుగని మానవులు - ఎచటనుండరని తెలుసునా - 2
యేసులో చేరని ఎందరో యుందురు - ఇదియూ కూడా నీకు తెలుసునా - 2
ఇదియే నా దుఃఖము తెలుసునా - ఇదియే నీ దుఃఖము తెలుసునా
3. నిన్ను ఓడించిన - నిఖిల పాపములను - నీవే ఓడింతువు తెలుసునా - 2
అన్ని ఆటంకములు - అవలీలగా దాటి - ఆవలకు చేరెదవు తెలుసునా - 2
అడ్డురారేవ్వరు తెలుసునా - హాయిగా నుందువు తెలుసునా
4. ఏ జబ్బునైననూ - యేసు నామము చెప్పి - ఎగురగొట్టెదవని తెలుసునా - 2
భూజనులు చావంగా - బోయి జీవము ధార - పోసి బ్రతికించెదవు తెలుసునా - 2
పూని బ్రతికించెదవు తెలుసునా - పునరుత్థానమిదియే తెలుసునా
5. బిడియమెందుకు నీకు - భీతి కలుగదు పరుల - పై తీర్పు తీర్చెదవు తెలుసునా - 2
పుడమి యంతట వ్యాప్తి - పొందెదవు నీ యెదుట - బడి నిల్వదాయుధము తెలుసునా - 2
జడియూ శత్రువు నీకు తెలుసునా - కడకు నీకే జయము తెలుసునా
కామెంట్‌ను పోస్ట్ చేయండి