Halleluya yesu prabhun lyrics హల్లెలూయ యేసు ప్రభున

హల్లెలూయ యేసు ప్రభున్

1.        హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి

బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి

ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

పల్లవి:    రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్

హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

2.        తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి

పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి

బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి

నిరంతరము మారని యేసుని స్తుతియించుడి               … రాజుల…

3.        సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి

హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి

అగ్నివడ గండ్లారమీరు  కర్తను స్తుతియించుడి

హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి           … రాజుల…

4.       యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి

జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి

పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి

ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి               … రాజుల…

5.       అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి

అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి

దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి

పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి              … రాజుల…

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes