Deva dhinapapini o pavana gavu దేవ! దీనపాపిని ఓ పావన గావు

Song no:314

దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవా||

ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు జేయవె తండ్రీ! ||దేవ||

నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని ||దేవ||

నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ||

పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది తల్లి ||దేవ||

ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన మొదవ జేతువు నాకు ||దేవ||

కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ||దేవ||

త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ శుద్ధాత్మను నాలో ||దేవ||

నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా మనసు ||దేవ||

కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ జేసెద ||దేవ||

ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ విప్పు నా పెదవులను ||దేవ||

కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు ||దేవ||

విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు ||దేవ||





Blogger ఆధారితం.