672
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పా||
- పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పా||
- దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెరవిడిపించితివి ||పా||
- ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి ||పా||
- అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి ||పా||
కామెంట్‌ను పోస్ట్ చేయండి