Sudha madhura kiranala arunodhayam సుధా మధుర కిరణాల అరుణోదయం

సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2)
1. దివి రాజుగా భువికి దిగినాడని  
రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని 
పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా నిరుపేదగా 
జన్మించగా ఇల పండుగ (2)
2. లోకాలలో పాప శోకాలలో 
ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సహపాలుగా 
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే ఒక మర్మము 
ఆ బంధమే అనుబంధము (2)

Blogger ఆధారితం.