Song no: 64
- యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
- నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి } 2
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ } 2
రక్షణ భాగ్యము నొసగితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో
- నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి } 2
చెదరిన నా హృది బాధలన్నిటిని } 2
నాట్యముగానే మార్చితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో
- అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా } 2
ఆహా రక్షక నిన్ను స్తుతించెద } 2
ఆనంద గీతము నేపాడి
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో
దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో
కామెంట్‌ను పోస్ట్ చేయండి