యేసుబోలి మంచిబుద్ధి యెంతో

547

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||

  1. యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||

  2. పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||

Post a Comment

కొత్తది పాతది