ఆ చిన్న వారిలో నేనుండి యున్న

546

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నే జూచి యుందు ||నా చిన్న||

  1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకుల బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నే జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న||

  2. ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తో గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||యా చిన్న||

  3. ఇ కమీద బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందున జూచి వినుచుందు ||నా చిన్న||

  4. శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||మా చిన్న||

Post a Comment

కొత్తది పాతది