హోమ్(ర రారె చూతము రాజసుతుడీ 116 రారాజు జన్మదినమ రాగం - హిందూస్థాని తోడి తాళం - ఆది రారె చూతము – రాజసుతుడీ – రేయి జనన మాయెను = రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో ॥రారె॥ దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా = దేవుడే మన – దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున ॥రారె॥ కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం = తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే ॥రారె॥ బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు = బాల బాలికా – బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు ॥రారె॥ యూద వంశము – ను ద్ధరింప దా – వీదుపురమున – నుద్భవించె సదమలంబగు – మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు ॥రారె॥ ✍ చెట్టి భానుమూర్తి Raare chuuthamu – raja suthudii – raeyi janana maayenu = raajulaku raa – raaju messiya - raajithambagu thaeja madhigoa ॥ Rare ॥ Dhuutha ganamulan – thaeri chuudarae – dhaiva vaakku lan – thelpagaa = dhaevudae mana – dhiina ruupuna – dha rani karigenii – dhinamuna ॥ Rare ॥ kalla gaadhidhi – kalayu gaadhdhi – golla boayala –dhars anam = thella gaanadhe – thaejarilledi - thaara gaanchare – thvaraga raarae ॥ Rare ॥ Baaludadugoa -vaela suuryula –boalu sadhguna– siiludu = baala baalikaa – baala vrudhdhula naela galigina – naadhudu ॥ Rare ॥ yuudha vamsamu –nu dhdharimpa dhaa-viidhu puramu na – nudhbhaqvinche = sadhamalambagu - madhini koli china – sarva janulaku saarvabhoumudu ॥ Rare ॥ ✍ Chetty Bhanumurthi akk 116