నా ప్రాణమా దిగులెందుకు నాలోపల వ్యధ చెందకు


నా ప్రాణమా దిగులెందుకు
నాలోపల వ్యధ చెందకు
ఎత్తైన నీ కోటగా సర్వాధిపతి ఉండగా
భయపడక నిలుచుండుమా
జయకరుని స్తుతియుంచుమా
1. చెఱలో నిను వేయాలని చెలికాండ్రు నీకై ఉరులొగ్గినా
అపహాస్యము చేయాలని తమ నాలుకలకు పదునెట్టిన
దేవుడు వారిని కూల్చివేయును
ఆకస్మికముగ పడద్రోయును
సంతోషించుము విశ్వసించుము
2. ఎటునైనను మ్రింగాలని అపవాది నిన్ను వెంటాడిన
తనవైపుకు లాగాలని పలుశోధనలను పంపించినా
దేవుని హస్తము నీతో ఉండును
సైతానే అపజయమొందును
స్థిరముగనుండుము శాంతినొందుము
3. కలనైనను ఊహించని కడగండ్లు నీకు ప్రాప్తించినా
ఎవరూ నిను ప్రేమించని కడు ఘోరస్థితిలో నీవుండగా
దేవుని ద్వారము నీకై తెరచును
మేలులతో నిను బలపరచును
యేసుని చూడుము చింతవీడుము