అంతే లేని నీ ప్రేమ ధార

Anthe Leni Nee Prema Dhaara
Entho Naapai Kuripinchinaavu
Vinthaina Nee Prema Konthaina Gaani
Kaanthimpa Krupa Naaku Choopinchinaavu (2)
Entho Entho Nee Prema Entho
Pondetanduku Ne Yogyudanu (Yogyuraalu) Kaanu
Antho Intho Aa Premanu Nenu
Panchetanduku Nee Bhaagyamu Pondaanu || Anthe ||

  • Parishuddhudu Athi Parishuddhudu
    Ani Doothalatho Pogadabade Devaa
    Padivelalo Athi Sundarudaa
    Neevegaa Athi Kaankshaneeyudaa (2)
    Naa Doshamulakai Aa Kaluvari Siluvalo
    Baliyaagamainaava Devaa (2)
    Sonthamugaa Ne Chesina Naa Paapamulanni
    Shaanthamutho Sahiyinchi Kshamiyinchinaavu
    Panthamutho Ninu Veedi Ne Paaripogaa
    Nee Raajyamunaku Cherchaga Vanthena Ainaavu || Anthe ||

  • Emunnadi Naalo Devaa
    Manchannade Lene Ledu
    Ainaa Neevu Nanu Rakshinchi
    Nee Saakshiga Nilipaavu Ilalo (2)
    Arhathaye Ledu Nee Peru Piluva
    Nee Soththugaa Nanu Maarchinaavaa (2)
    Emivvagalanayyaa Nee Premaku Badulu
    Naa Jeevithamanthayunu Nee Korake Devaa
    Nee Sevalo Nenu Konasaagedanayyaa
    Prakatinthu Nee Prema Thudi Shwaasa Varaku || Anthe ||
  • అంతే లేని నీ ప్రేమ ధార
    ఎంతో నాపై కురిపించినావు
    వింతైన నీ ప్రేమ కొంతైన గాని
    కాంతింప కృప నాకు చూపించినావు (2)
    ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
    పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
    అంతో ఇంతో ఆ ప్రేమను నేను
    పంచేటందుకు నీ భాగ్యము పొందాను || అంతే ||

  • పరిశుద్ధుడు పరిశుద్ధుడు
    అని దూతలతో పొగడబడే దేవా
    పదివేలలో అతి సుందరుడా
    నీవేగా అతి కాంక్షనీయుడా (2)
    నా దోషములకై ఆ కలువరి సిలువలో
    బలియాగమైనావ దేవా (2)
    సొంతముగా నే చేసిన నా పాపములన్ని
    శాంతముతో సహియించి క్షమియించినావు
    పంతముతో నిను వీడి నే పారిపోగా
    నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు || అంతే ||

  • ఏమున్నదీ నాలో దేవా
    మంచన్నదే లేనే లేదు
    అయినా నీవు నను రక్షించి
    నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
    అర్హతయే లేదు నీ పేరు పిలువ
    నీ సొత్తుగా నను మార్చినావా (2)
    ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
    నా జీవితమంతయును నీ కొరకే దేవా
    నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
    ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు || అంతే ||