Junte thene dharalu kaanna yesu namame madhuram జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

Song no: 119

    జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
    యేసయ్యా సన్నిధినే మరువజాలను } 2
    జీవిత కాలమంతా ఆనదించెదా- యేసయ్యనే ఆరాధించెదా } 2

  1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
    నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి } 2
    నన్నెంతగానో దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే} 2 || జుంటె తేనె ||

  2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
    నాతోడై నిలచి క్షేమముగా నను దాచి } 2
    నన్నెంతగానో కరుణించి - పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే} 2 || జుంటె తేనె ||

  3. యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించె సువాసనగా నను మార్చె } 2
    నన్నెంతగానో ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే} 2 || జుంటె తేనె ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes