జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము

462
Jayaprabhu yaesune vembadinchuchu- jayamuga nadache dhamu –yaesutho jayamuga vedaledhamu=priyudagu yaesuni praemanu chavigoni– payanamu jaeseda maa prabhu vembadi Jayaprabhu yaesune

1. Aadharanayu adhikabalamunu aathmakhadgamunu-avaniloa andhari rakshayunu = aadharshambhaow aayana vaakyamae – anisamu manikila maargamu chupaga Jayaprabhu yaesune

2. dhara viroadhulu mammu juttaga–dhari jaeredha mae sun– prabhuni dharijaeredha memu=dhathri dhuraasala dambamulanniti-maithrini veedi nadachedhamaesuthoa Jayaprabhu yaesune

3. maa prabhu joopumu needhu maargapu – maadiri jaada lanu –nee dagu=maadhiri jaadalanu=maa paadamulanu thotrilakundaga–maakidu balamunueiikrupaadinamuna Jayaprabhu yaesune

4.maa korakai neevu nadachina maargamu juudaganu–maemu maargamu joodaganu =maa rakhshaka nee adu gu jaadalu – maravaka viduvaka naduvaga krupanidu Jayaprabhu yaesune

5.eihaparamula ninugaaka praemathoa–eavarani goliche dhamu?–eavarani praemipa vasame?=viharinchedhamu yaesuni vembadi – mahima rajyamuna yesuni goluvaga Jayaprabhu yaesune
జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము – యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని – పయనము జేసెద మా ప్రభు వెంబడి

1. ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగ

2. ధర విరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో

3. మా ప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ – మా కిడు బలమును యీ క్రుపాదినమున

4. మా కొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు

5. ఇహపరముల నినుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడి – మహిమ రాజ్యమున యేసుని గొలువగ
Blogger ఆధారితం.