నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

Song no: 173

    నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
    నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)
    వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
    నీ ప్రియమైన స్వాస్థ్యమును
    రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
    నీ రాజ్య దండముతో || నీతి ||

  1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
    ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)
    నిత్యమైన కృపతో నను బలపరచి
    ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) || నీతి ||

  2. పరిమళ వాసనగ నేనుండుటకు
    పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)
    ప్రగతి పథములో నను నడిపించి
    ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) || నీతి ||

  3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
    నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)
    మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
    ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) || నీతి ||


    Neethi Nyaayamulu Jariginchu Naa Yesayyaa
    Nithya Jeevardhamainavi Nee Shaasanamulu (2)
    Vruddhi Chesithivi Parishuddha Janamugaa
    Nee Priyamaina Swaasthyamunu
    Raddu Chesithivi Prathivaadi Thanthramulanu
    Nee Raajya Dandamutho         ||Neethi||

    Prathi vaagdhaanamu Naa Korakenani
    Prathi Sthalamandu – Naa Thodai Kaapaaduchunnaavu Neevu (2)
    Nithyamaina Krupatho Nanu Balaparachi
    Ghanathanu Deerghaayuvunu Dayacheyuvaadavu (2)       ||Neethi||

    Parimala Vaasanaga Nenundutaku
    Parishuddha Thailamutho – Nannabhishekinchi Yunnaavu Neevu (2)
    Pragathi Pathamulo Nanu Nadipinchi
    Prakhyaathini Manchi Perunu Kaliginchuvaadavu (2)       ||Neethi||

    Nithya Seeyonulo Neetho Niluchutaku
    Nithya Nibandhananu – Naatho Sthiraparchuchunnaavu Neevu (2)
    Mahima Kaligina Paathraga Undutaku
    Pragna Vivekamulatho Nanu Nimpuvaadavu (2)       ||Neethi||

Post a Comment

కొత్తది పాతది