కరుణా రసభరిత యెహోవ ఏతావ తార ప్రభో

    కరుణా రసభరిత యెహోవ ఏతావ తార ప్రభో } 2
    శరణార్థులకిల ఆశ్రయ గృహమౌ
    క్రైస్తవ సమాక్య జీవప్రధాత } 2 || కరుణా ||

  1. దివ్య వదువు భువిపై జన్మింపను
    శిలువలో కార్చిన రుదిరములో } 2
    భవ్యముగా నీ ప్రాణము నొసగిన
    నవ యుగ వరుడవు నీవెగదా } 2 || కరుణా ||

  2. భూమి పునాదులు వేయకమునుపే
    ప్రేమలో మమ్మును భరియించి } 2
    సుమంగలికి నీ వాక్యము తాళిగ
    సదయుగ నొసగిన నీవెగదా } 2 || కరుణా ||

  3. కల్వరిలో జన్మించిన సంఘము
    చెల్వముగ నీ లోగిలిలో } 2
    ఫలభరితంబగు వల్లిగ మెలగను
    విలువలు గూర్చిన నీవెగదా } 2 || కరుణా ||

Post a Comment

కొత్తది పాతది