పరిమళ సుమములు పూసెను ప్రభుదయ ధర విరబూసెను

పరిమళ సుమములు పూసెను } 2
ప్రభుదయ ధర విరబూసెను " పరిమళ "

  • అరుణోదయముగ మారెను రాత్రి
    కరుణా వరములు కురిసెను ధాత్రి } 2
    పరమ రహాస్యము ప్రేమతో
    ప్రసరించెను ప్రభు జన్మతో } 2

  • దరిసెన మాయెను వరదును నీతి
    విరమణమాయెను నరకపు భీతి } 2
    విరిసె క్షమాపణ హాయిగా
    మరియ కిశోరుని జన్మగా } 2

  • మెరిసెను మనమున వరుని సుహాసం
    పరిచయమాయెను పరమ } 2
    నివాసం మురిసెను హృదయము కొల్లగా
    అరుదెంచగ ప్రభు చల్లగా } 2
  • కొత్తది పాతది