Song no:
-
కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2
- ప్రతి ఉదయం నీ స్తుతిగానం - దినమంతయు నీ ధ్యానం } 2
ప్రతి కార్యం నీ మహిమార్థం - సంధ్య వేళలో నీ స్తోత్రగీతం } 2
- నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ - వేలాది స్థుతులన్ చెల్లిస్తూ } 2
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ - నిన్నే నేను ఆరాధిస్తూ } 2
- అమూల్యమైనదీ నీ నామం - ఇలలో శ్రేష్ఠమైనదీ నీ నామం } 2
ఉన్నతమైనదీ నీ నామం - నాకై నిలచిన మోక్ష మార్గం } 2
మనసారా ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్ } 2
కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2