ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ||2||
ఇది నీ పుట్టిన రోజు...
మనసైన వేడుక రోజు... ||2|| || అవధులు ||
"Happy Birth Day To You..."
ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి ||2||
ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి ||2||
జీవితమంతా ఏసునీ కొరకు సాక్షిగా జీవించాలి... ||2|| || అవధులు ||
"Many Greetings To You..."
ఈ లాంటి పుట్టిన రోజులు నీవేన్నో చేసుకోవాలి... ||2||
నీదు జీవితం అనేకులకు దీవెన కరమై సాగాలి ||2||
నీ గృహమే స్వర్గముగా ధర లో సిరులతో తులతూగాలి... ||2|| || అవధులు ||
"May God Bless You, Dear..."
మొదలుపెట్టిన పనులన్నిటిలో విజయం తో వెలగాలి ||2||
ఉన్నతమైన శికరాలెన్నో నీవదిరోహించాలి ||2||
చదువులు పదవులు వ్యాపారములో వృద్ధి ని సాదించాలి... ||2|| || అవధులు ||
"Happy Long Life To You..."