అడిగినదానికంటెను ఊహించినదానికంటెను
అత్యధిక విజయమిచ్చావు – ఆనందము కలిగించావు

అ.ప: దేవా వందనం – మా ప్రభువా వందనం
1 శక్తిచేత కానేకాదు – బలముతోనైతే జరుగదు
ఆత్మద్వారా జరిగించావు – మా విశ్వాసము పెంచావు

2 ఆటంకములు ఎదురైనప్పుడు – దిగులుతో భయపడినప్పుడు
నిబ్బరముతో నిలబెట్టావు – మా తలలను పైకెత్తావు

3 సామర్ధ్యము సరిపోనప్పుడు – కొరతతో పని చెడినప్పుడు
వనరులన్నీ సమకూర్చావు – మా కోరిక నెరవేర్చావు

4 శత్రుమూక అల్లరి చేసినా – పని పాడుచేయచూసినా
చివరకు మము గెలిపించావు – మా శ్రమలను మరిపించావు