Song no: 118
-
నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - 2
- ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా
దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన
తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2
- అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి
ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - 2
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2
- లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా
మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా
అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి
నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - 2
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - 2
నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - 2
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2