సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ||ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ||వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ||ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ దన్ను వేఁడు మహేష్టులను రక్షించును ||సర్వ||దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే ||సర్వ|| ✍ మిక్కిలి సమూయేలు Sarva Shakthuni Sthothragaanamu Salpare Jagamellanu Nirvahinchunu Daasa Bhaaramu Nithyamedha Raajillanu (2) || Sarva || Mudamutho Nirmaanakundagu Moola Karthanu Baadare Vadana Meekshmaanvanchi Devuni Vandanamutho Vedare (2) || Sarva || Vedapaaraayanamu Seyuchu Vishwamantha Jayimpare Saadaramugaa Devu Nika Mee Swaanthamuna Boojimpare (2) || Sarva || Edanu Vishraanthin Pareshuni Hechchugaa Nuthi Jeyare Sadamalambagu Bhakthitho Mee Sarva Maayana Keeyare (2) || Sarva || Chaavu Puttuka Lenivaaduga Santhathamu Jeevinchunu Eevulichchuchu Dannu Vedu Ma- heshtulanu Rakshinchunu (2) || Sarva || Daasulai Devuniki Nedalo Darpamunu Bogaalpare Yesukreesthuni Punya Vasthramu Ne Maraka Maidaalpare (2) || Sarva || ✍ Mikkili Samuyelu akk 8 గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా జనవరి 29, 2018 యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే జనవరి 30, 2018 యేసుని నామములో మన బాధలు పోవును జనవరి 27, 2018 నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య ఆగస్టు 16, 2025 గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన మార్చి 11, 2024 పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా ఫిబ్రవరి 01, 2023 Tags అ ఇ ఉ ఎ ఐ ఒ క గ చ జ డ త ద న ప బ మ య ర ల వ శ ష స హ !doctype> !doctype> !-> !->!doctype>!doctype>!doctype> Contact form
✍ మిక్కిలి సమూయేలు
✍ Mikkili Samuyelu