స్తుతి స్తోత్రార్హుడా యేసయ్యా

    స్తుతి స్తోత్రార్హుడా యేసయ్యా
    తరతరములకు పూజ్యుడా
    స్తుతి ఆరాధన నీకేనయ్యా
    యుగయుగములకు ఆరాధ్యుడా

    వందనం వందనం యేసు రాజా నీకే నా వందనం

    నలిగిన నాహృదయం దృఢపరచి
    శ్రమల సంకెళ్లను తొలగించితివి
    దు:ఖ దినమున ఓదార్చీ
    ఉల్లాస వస్త్రమును ధరియింపజేసితివి || వందనం ||

  1. దీవెన వర్షములు నాపై కురిపించి
    మోడైన నాబ్రతుకు చిగురింపజేసితివి
    తోటమాలివై ననుగాచి
    ఆత్మ ఫలముతో ఫలియింపజేసితివి || వందనం ||

  2. ఒంటరినైన నన్ను వేలకొలదిగజేసి
    నిత్యమైన వాత్సల్యం నాపై చూపితివి
    నిత్యనింబంధన నాతో చేసి
    శోభాతిశయముగ నను మార్చితివి || వందనం ||

    About Lyrics Life

    This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 Post a Comment :

కామెంట్‌ను పోస్ట్ చేయండి