chinna chinna pillalara rarandi చిన్న చిన్న పిల్లలూ రారండి


చిన్న చిన్న పిల్లలూ రారండి
చిన్నారి యేసుని చేరండి } 2

బెత్లెహేములో రక్షకునిగా
మనకొరకు పుట్టినాడు చూడండి } 2

దూతలు పాటలు పాడుచున్నారు
గొల్లలు సంబరాన ఆడుచున్నారు } 2
బోసి నవ్వులు చిందించుచు
తొట్టిలో పరుండెను చూడండి } 2

జ్ఞానులు చుక్కవెంట వచ్చియున్నారు
విలువైన కానుకలు తెచ్చియున్నారు } 2
జనులందారిని రక్షించుటకు
దివినుండి దిగినాడు చూడండి } 2
Blogger ఆధారితం.