ఉదయించినావా దేవా నా హృదయసీమలో
వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో
కలిగించను నిరీక్షణ నా నిరాశలో
వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో
కలిగించను నిరీక్షణ నా నిరాశలో
1 యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు
నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు
నీకెవరూ సరిరారు ప్రభువా – నీతో ఇలా సములెవరు విభవా
నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు
నీకెవరూ సరిరారు ప్రభువా – నీతో ఇలా సములెవరు విభవా
2 ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం
నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం
ఆద్యంత రహితుడవు ప్రభువా – నిజమైన దేవుడవు విభవా
నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం
ఆద్యంత రహితుడవు ప్రభువా – నిజమైన దేవుడవు విభవా