Iedhi kanniti pata christmas siluva pata ఇది కన్నీటి పాట క్రిస్టమస్ సిలువ పాట


Song no:


పల్లవి:
ఇది కన్నీటి పాట క్రిస్టమస్ సిలువ పాట ||2||
కరకు గుండెను కరిగించేపాట
కలవారి కొండకు నడిపించే పాట
||ఇది కన్నీటి||

చరణం:
సర్వ సృష్టికర్తకు స్థలము ఎక్కడ
సత్రములో స్థలమైన లేదు ఇక్కడ
సర్వోన్నత శక్తికి ప్రసవమెక్కడ
పశువుల పాకే ప్రసూతి స్థలము ఇక్కడ
ఆత్మలో తగింపు తత్వమే ||2||
క్రిస్టమస్ సిలువ మార్గము
||ఇది కన్నీటి||

చరణం:
రాజుల రారాజుకు నివాసమెక్కడ
తల వాల్చుటకు తలగడ లేదు ఇక్కడ
ప్రభువుల ప్రభువుకు పీటమెక్కడ
ఒలీవ తోటలో రాళ్ళు రప్పలిక్కడ
మనస్సులో ప్రార్ధన తత్వమే ||2||
క్రిస్టమస్ సిలువ సత్యము
||ఇది కన్నీటి||

చరణం:
భూతలి స్తుతి పాత్రుడు ఏసు అక్కడ
మానవాళి బలి పసువు క్రీస్తు ఇక్కడ
కృపాసన సీనుడు ఏసు అక్కడ
గొల్గూత గోరియ పిల్ల క్రీస్తు ఇక్కడ
శరీరాన సమర్పణ తత్వమే ||2||
క్రిస్టమస్ సిలువ జీవము
||ఇది కన్నీటి||

Blogger ఆధారితం.