అతిశ్రేష్టుడా - అద్వితీయుడా నిన్నెవరితో
పోల్చిచూతును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును
నా ప్రేమమూర్తి యేసు నీవుండగా
నేనింక వేరేమి కోరుకుందును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును
నా ప్రేమమూర్తి యేసు నీవుండగా
నేనింక వేరేమి కోరుకుందును
1. నా కోసమే ఆ సిలువలో - ఎన్నెన్ని బాధలు
అనుభవించినావు
మరణంబునొందునంతగా - నీ ప్రేమ చూపినావుగా
మరణంబునొందునంతగా - నీ ప్రేమ చూపినావుగా
2. ఇహలోకపు మమతలన్నియు - నీ ప్రేమముందు బహుస్వల్పమే
ఇలలోని సంపదలన్నియు - నీ ఎదుట చూడ అల్పమే
ఇలలోని సంపదలన్నియు - నీ ఎదుట చూడ అల్పమే
3. ఇల నన్ను కన్నతల్లికన్ననూ - విలువైన ప్రేమ
చూపించితివే
వెలలేని మంచిమిత్రుడా - బలమైన నా దేవుడా
వెలలేని మంచిమిత్రుడా - బలమైన నా దేవుడా