పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ

671 244 604
"క్రీస్తు భక్తిహీనులకొరకు చనిపోయెను." రోమా Romans 5:6

Parama Jeevamu Naaku Nivva
Thirigi Lechenu Naatho Nunda
Nirantharamu Nannu Nadipinchunu
Marala Vachchi Yesu Konipovunu

Yesu Chaalunu – Yesu Chaalunu
Ae Samayamaina Ae Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu

  • Saathaanu Shodhanaladhikamaina
    Sommasillaka Saagi Velledanu
    Lokamu Shareeramu Laaginanu
    Lobadaka Nenu Velledanu || Yesu ||

  • Pachchika Bayalulo Parundajeyun
    Shaanthi Jalamu Chentha Nadipinchunu
    Anishamu Praanamu Thrupthi Parachun
    Marana Loyalo Nannu Kaapaadunu || Yesu ||

  • Narulellaru Nannu Vidichinanu
    Shareeramu Kulli Krushinchinanu
    Harinchinan Naa Aishwaryamu
    Virodhivale Nannu Vidachinanu
    || Yesu ||
  • పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ
    నిరంతరము నన్ను నడిపించును
    మరల వచ్చి యేసు కొని పోవును

    యేసు చాలును – యేసు చాలును
    యే సమయమైన యే స్థితికైన
    నా జీవితములో యేసు చాలును

  • సాతాను శోధనలధికమైన
    సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
    లోకము శరీరము లాగినను
    లోబడక నేను వెళ్ళెదను || యేసు ||

  • పచ్చిక బయలులో పరుండజేయున్
    శాంతి జలము చెంత నడిపించును
    అనిశము ప్రాణము తృప్తిపరచున్
    మరణ లోయలో నన్ను కాపాడును || యేసు ||

  • నరులెల్లరు నన్ను విడిచినను
    శరీరము కుళ్ళి కృశించినను
    హరించినన్ నా ఐశ్వర్యము
    విరోధివలె నన్ను విడచినను || యేసు ||