చూడుము ఆ సిలువను

|| చూడుము ఆ సిలువను ||

పల్లవి: చూడుము ఆ సిలువను –
సిలువలో ఆ యేసును
యేసులో ఆ ప్రేమను
ప్రేమలో ఆ త్యాగమును
చూడుము నేడే చూడుము –
చూడుము యేసుని చూడుము || చూడుము ఆ సిలువను ||

1. కొక్కెపు కొరడాలతో కొట్టిరి బాధించిరి
ముళ్ళ కిరీటమును ధరించిరి హింసించిరి
మన పాపములకోరకై సిలువ పైన యేసు
మన రక్షణ కొరకై బలియాయెను క్రీస్తు || చూడుము ఆ సిలువను ||

2. కాళ్ళకు చేతులకు శిలలను దిగ కొట్టిరి
సిలువలో క్రీస్తునకు బల్లెముతో పోడిచిరి
ఉమ్మును వేసిరి యేసుని దూషించిరి
యూదుల రాజ శుభమని హేళన చేసిరి || చూడుము ఆ సిలువను ||