Devude nakasrayanbu dhivyamaina dhurgamu దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము

Song no:

      దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
      మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
      అభయ మభయ మభయ మెప్పు
      డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||

      పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
      సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||

    1. దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
      ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
    2. రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
      పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||
    3. విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
      చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||
    4. పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
      నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ||
    5. కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
      ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes