రమ్ము నీ తరుణమిదే

684

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకుజీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము||

  1. కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము||

  2. అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము||

  3. మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము||

  4. తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము||

  5. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము||

Post a Comment

కొత్తది పాతది