- కృప కృప నా యేసు కృపా
- నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై – నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను – నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
- నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో – మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని – ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
- పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను – హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై – విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
- పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||